రేణూ దేశాయ్‌కి సినిమాల్లో ఎంత పాపులారిటి వచ్చిందో తెలియదు గాని సోషల్ మీడియాలో ఆమె చేసే హడావిడితో విపరీతమైన పాపులారిటి సంపాదించుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అనుభవాలను అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. పట్టణాల్లో ఉండేవారికి పల్లెలకు వెళ్లాలనీ, అక్కడ కొన్ని రోజులు సరదాగా గడపాలని అనిపిస్తుంది. పట్టణాల్లో ఉండే ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యం కంటే… గ్రామాల పచ్చదనంలో తిరుగుతుంటే ఎంతో ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటుంది. నటి రేణూ దేశాయ్‌కి కూడా అలాంటి కోరిక ఎప్పటి నుంచో అలా ఉండిపోయిందట. అది ఇటీవల తీరిందని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హార్ట్ టచింగ్ మెసేజ్ ఇచ్చారు.
ఎంత డబ్బుండి ఏం లాభం: రేణూ దేశాయ్