నమ్మకంగా దోచేశాడు

సాక్షి, విశాఖపట్నం: కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ఇంటి యజమాని వద్ద కారు డ్రైవర్‌గా నమ్మకంగా పనిచేస్తూ... అదే ఇంటిలో బంగారం, నగదు దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు నగర డీసీపీ – 2 ఉదయ్‌భాస్కర్‌ బిల్లా తెలిపారు. 21 తులాల బంగారం, రూ.4.49 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నామని తెలిపా రు. నగర పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం పి.ఆర్‌.గార్డెన్స్‌లో గల శ్రీరామ్‌ అపార్టుమెంట్స్‌లో రిటైర్డ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌ పేరి గోపాలకృష్ణ(78) భార్యతో కలిసి నివాసముంటున్నారు. కంచరపాలెం కోకో కంపెనీ వెనుక నివాసముంటున్న సత్యనారాయణ(36) అనే వ్యక్తిని నెలకు రూ.10వేలు వేతనమిస్తూ కారు డ్రైవర్‌గా పెట్టుకున్నారు. సత్యనారాయణ నమ్మకంగా పనిచేస్తూ కొన్నాళ్లకు ఇంటిలో మనిíÙలా వ్యవహరించేవాడు. గోపాలకృష్ణ పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడటంతోపాటు ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం కావడంతో ఇంట్లో నగదు, బంగారు ఆభరణాల విషయంలో పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు పెట్టడం, తాళాలను ఒక కబోర్డులో ఉంచడాన్ని సత్యనారాయణ గమనించాడు.