<no title>

గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు 'సింహా' వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన 'లెజెండ్' మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో  సినిమా కావడంతో  ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో నటించే అవకావాన్ని రెమ్యునరేషన్‌ కోసం మిస్‌ చేసుకుంది కేథరిన్‌. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించే హీరోయిన్‌ కోసం బోయపాటికి తంటాలు తప్పడం లేదు. తరచుగా ఏదో ఒక హీరోయిన్‌ పేరు వినిపించడం.. తీరా సదరు బ్యూటీ ఆ వార్తలని ఖండించడం మామూలైపోయింది. కేథరిన్‌కి ముందు చిత్ర యూనిట్‌.. మిల్క్‌ బ్యూటీ తమన్నాను సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఆ మధ్యన బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా బాలయ్యతో జోడీ కట్టనుందని వార్తలు వినిపించినా సోనాక్షి వాటిని ఖండించింది. మొత్తానికి బాలయ్యకు హీరోయిన్‌ని వెతకడం బోయపాటికి పెద్ద సవాల్‌గా మారినట్లు ఉంది.