ర్యాష్‌ డ్రైవింగ్‌పై వేటు పడింది

గచ్చిబౌలి: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగుతుండగా.. మద్యం మత్తులో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అభిలాష్‌ ర్యాష్‌ డైవింగ్‌ చేస్తూ ఇద్దరు యువకులను ఢీకొట్టడంతో వారు కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశాడని నిర్ధారించిన రాయదుర్గం పోలీసులు ఐపీసీ 304(ఏ)337, 279, సెక్షన్‌లతో పాటు 185 ఆఫ్‌ ఎంవీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఆల్కహాల్‌ 230ఎంజీ/100 ఎంఎల్‌గా ఉండటంతో కూకట్‌పల్లి ఆర్‌టీఏ అధికారులు 2019 నవంబర్‌ 15 నుంచి 2020 నవంబర్‌ 15 వరకు సంవత్సరం పాటు లైసెన్స్‌ రద్దు చేశారు.