బంజారాహిల్స్: ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. మూడు నెలల క్రితం కూతురు డెంగీ జ్వరంతో కోమాలోకి వెళ్లి మరణించింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి సైతం కోమాలోకి వెళ్లి రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూయడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్– 10లో వాకింగ్ చేస్తున్న యువకుడిని మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలై కోమాలోకి వెళ్లిన బాధితుడు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు. కర్ణాటకకు చెందిన కురువ అశోక్ (30) కారు డ్రైవర్‌గా పని చేస్తూ భార్య మంజుతో కలిసి బోరబండ సమీపంలోని ఎస్పీఆర్ హిల్స్ బీజేఆర్ నగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
విధి విషాదం