రోడ్డు ప్రమాదం.. కానీ స్నేహితులే అత్యాచారం చేసి

నోయిడా : నోయిడాలో 20 ఏళ్ల అమ్మాయిని గత శుక్రవారం యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో ఆమెకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఢిల్లీలోని గురుతేజ్‌ బహుదూర్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. అయితే తమ కూతురు మరణం వెనుక అనుమానం ఉందంటూ తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. తమ కూతురును తన ఇద్దరు స్నేహితులే అత్యాచారం చేసి ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కోన్నారు.