ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు పవన్‌ కల్యాణ్‌ లేఖ

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు లేఖ రాశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడితే వాటిని వ్యతిరేకించాలని పార్టీ నిర్ణయించినట్లు పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లేఖను కూడా పవన్ ఎమ్మెల్యే రాపాకకు పంపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుల్ని వ్యతిరేకించాలని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని, అదే సమయంలో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.