ముంబై : బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన మొదటి సంపాదనతో తాజ్‌మహాల్‌ను సందర్శించడం..అక్కడ తాను ఎదుర్కొన్న సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు. షారుక్ తాజాగా కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రెమో డి సౌజాతో కలిసి డాన్స్ ప్లస్ సీజన్ 5లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెమో డి సౌజా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండగా.. డాన్స్ ప్లస్ షోలో గణతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ఎపిసోడ్‌లో షారుఖ్ కనిపించనున్నారు. ఇందుకు తాజ్ మహల్ కటౌట్ నేపథ్యంలో 20 నిమిషాల పాటు పలు పాటలకు డాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా షారుక్ తన కెరీర్ ప్రారంభంలోని అనుభూతులను నెమరువేసుకున్నారు.
లస్సీలో తేనెటీగ పడినా తాగాను: షారుక్