సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో లిక్కర్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ దుకాణం నుంచే లిక్కర్ తరలించుకుపోతోంది. ఆదివారం విజయవాడ నగరంలో ప్రభుత్వ మద్యం షాపు నుంచి ఓ ప్రైవేటు బార్ యాజమాన్యం సరుకును తరలించింది. పట్టపగలే ఈ తంతు జరిగినా ఆ ప్రభుత్వ మద్యం షాపుకు కూతవేటు దూరంలో ఉన్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఇటువంటి ఘటనలు జరుగుతున్నా.. ఎక్సైజ్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో బెజవాడలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందన్న విమర్శలున్నాయి.
ఏమార్చి.. రూటు మార్చి..