వ్యక్తి అనుమానాస్పద మృతి

కల్హేర్‌(నారాయణఖేడ్‌): మెడలో ఉరితాడుతో అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు.  మృతుడిని ఎవరైన హత్య చేశారా? ఆత్మహత్య చేసకున్నాడా అనే విషయం ప్రశ్నర్థకంగా మారింది. మంగళవారం సిర్గాపూర్‌ మండలం కడ్పల్‌ శివారులో ఈ సంఘటన జరిగింది. కడ్పల్‌ గ్రామనికి చెందిన జువ్వి అంబయ్య(40) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శవమై కనిపించాడు. అంబయ్య మృతి పట్ల కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. అంబయ్య మృతి పట్ల భార్య జువ్వి భవానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేసింది. కంగ్టి సీఐ వెంకటేశ్వర్‌రావు, సిర్గాపూర్‌ ఎస్‌ఐ మొగులయ్య, ఎఎస్‌ఐ నారాయణ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అంబయ్య మృతి పట్ల విచారణ జరిపారు. మిస్టరీ ఛేదించేందుకు డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీంను రంగంలోకి దించారు. డాగ్‌ స్క్వాడ్‌ సంఘటన స్థలం నుంచి కొద్ది దూరంలో రోడ్డు వరకు వెళ్లి ఆగింది. దీంతో క్లూస్‌ టీం అధికారులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని ఎస్‌ఐ మొగులయ్య తెలిపారు. మృతదేహన్ని నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు.