బెంగళూరు: మూడు వన్డేల సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని కోహ్లి సేన 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(119, 128 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘ ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాం. 290 పరుగులలోపే ఆసీస్‌ను కట్టడి చేయాలనే మా ప్రణాళిక సక్సెస్ అయ్యింది. ఇది చాలా కీలకమైన మ్యాచ్. సిరీస్‌ను డిసైడ్ చేసే మ్యాచ్. రాహుల్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించడానికి యత్నించా.
‘రాహుల్ ఔటైన తర్వాత అదే అనుకున్నాం’