అప్పుడు తమన్నా.. ఇప్పుడు కేథరిన్‌

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న సినిమాలో నటించడానికి హీరోయిన్‌ కేథరిన్‌ థెరిసా నో చెప్పిందట. రూలర్‌ సినిమా తర్వాత బాలయ్య నటించే భారీ బడ్జెట్‌ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాలో కేథరిన్‌ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేసినా.. రెమ్యునరేషన్‌ విషయంలో రాజీ కుదరలేదట. బాలయ్యతో జోడీ కట్టేందుకు దాదాపు కోటి రూపాయలు డిమాండ్‌ చేసిందట ఈ భామ. ఇంత భారీ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు నిరాకరించడంతో కేథరిన్‌.. ఈ అవకాశాన్ని వదులుకున్నట్టు టాలీవుడ్‌ టాక్‌. 2013లో చమ్మక్‌ చల్లో అనే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కేథరిన్‌.. ‘ఇద్దరమ్మాయిలతో’  సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.