గుల్జార్‌.. అక్రమమేనా?

సాక్షి, సిటీబ్యూరో: దుబాయ్‌లో ఉండగా మిస్డ్‌కాల్‌ ద్వారా పరిచయమైన కర్నూలు మహిళ కోసం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి, గత నెలలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులకు చిక్కిన గుల్జార్‌ ఖాన్‌ పాకిస్థానీ అని అధికారికంగా నిర్ధారించడానికి పోలీసు విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ద్వారా దౌత్య కార్యాలయాన్ని సంప్రదించడానికి సన్నాహాలు చేస్తోంది. గుల్జార్‌ వ్యవహారంపై పాకిస్థాన్‌ నుంచి వచ్చే సమాధానం ఆధారంగానే తదుపరి చర్యలు చేపట్టాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు.