కాంబ్లికి సచిన్‌ సవాల్‌.. వారం రోజులే గడువు!

ముంబై: లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన ఆప్త మిత్రుడు వినోద్‌ కాంబ్లికి ఓ సవాల్‌ విసిరాడు. అంతేకాకుండా ఆ చాలెంజ్‌ను కేవలం ఏడు రోజుల్లో పూర్తి చేయాలని మరో మెలిక పెట్టాడు. అయితే సచిన్‌ సవాల్‌ను కాంబ్లి స్వీకరించాడు. వారం రోజుల్లో సచిన్‌ చెప్పిన పనిని పూర్తి చేస్తానని కాంబ్లి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ ఆ చాలెంజ్‌ ఏంటంటే.. గతంలో బాలీవుడ్‌ సింగర్‌ సోనూ నిగమ్‌తో కలిసి సచిన్‌ 'క్రికెట్ వాలీ బీట్ పే' అనే సాంగ్‌ను పాడిన విషయం తెలిసిందే. అయితే ఆ పాటకు కేవలం ఏడు రోజుల్లో ర్యాప్‌ చేయాలని కాంబ్లికి సచిన్‌ సవాల్‌ విసిరాడు. ఈనెల 28 లోపూ ‘క్రికెట్‌ వాలీ బీట్‌ పే’కు ర్యాప్‌ సాంగ్‌ పాడకుంటే కాంబ్లి తనకు ఏదో రుణపడి ఉంటాడని సచిన్‌ పేర్కొన్నాడు.