వడా పావ్‌ ఎలా తినాలంటే?

దేశ ఆర్థిక రాజధాని ముంబై పేరు చెప్పగానే ఆహార ప్రియులకు మొదటగా గుర్తొచ్చేది ‘వడా పావ్‌’. పేదాగొప్ప తేడాలను చెరిపేసే ఈ స్కాక్‌కు మరాఠ ప్రజలు పట్టం కడతారు. అయితే శుక్రవారం ముంబై వీధుల్లో టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేకు వడా పావ్‌ తింటుంటే అతడికి ఓ సందేహం కలిగింది. దీంతో తన సందేహాన్ని నివృతి చేసుకునేందుక వెంటనే తన అధికారిక ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘మీకు వడా పావ్‌ ఎలా తినడం ఇష్టం.. 1, చాయ్‌తో వడా పావ్‌, 2. చట్నీతో వడా పావ్‌, 3. కేవలం వడా పావ్‌’అంటూ తన మనసులోని సందేహాన్ని ట్వీట్‌ రూపంలో భయటపెట్టాడు. అయితే రహానే అడిగిన ప్రశ్నకు ఫ్యాన్స్‌ వినూత్నంగా సమాధానం ఇచ్చారు.