హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్, ఆర్థిక సేవల సంస్థ బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి అపోలో హాస్పిటల్స్–బజాజ్ ఫిన్‌సర్వ్ హెల్త్ ఈఎంఐ కార్డును ప్రవేశపెట్టాయి. వైద్య సేవలకు అయిన వ్యయాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించేందుకు ఈ కార్డు వీలు కల్పిస్తుంది. ఆసుపత్రిలో ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. రూ.4 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. 12 నెలల్లో ఈ మొత్తాన్ని బజాజ్ ఫిన్‌సర్వ్‌కు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది. కార్డుదారుకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతోపాటు డిస్కౌంట్ వోచర్స్, కూపన్స్ ఆఫర్ చేస్తారు.
వైద్యానికి రూ.4 లక్షల వరకు రుణం