పిల్లలతో వాంఛ.. దంపతులకు 26 ఏళ్ల జైలు

మాంచెస్టర్‌:  ‘మీ ఇద్దరికి లైంగిక కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మీకు, మీ ఇంటి వరకు పరిమితం అయితే అది మీ ప్రైవసికి సంబంధించిన విషయం. అది మీ పరిధి దాటి ముక్కు పచ్చలారని పిల్లలను మీ కామవాంఛలోకి లాగారు. అది ఆ పిల్లలపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు అంతులేని బాధను మిగులుస్తుంది. అందుకని మిమ్మల్ని కఠినంగా శిక్షించాల్సిందే!’
‘మీలో కీలి బుర్లింగమ్‌ అనే 33 ఏళ్ల యువతి సామాన్యరాలు, సాదాసీతా జీవితం గడుపుతున్నారు. ఆమె మానసికంగా ఎంతో కుమిలిపోతోంది. పెళ్లి పెటాకులవడంతో కూడా ఆమె బాధ పడుతోంది. భర్త పీటర్‌ టేలర్‌ (33) ప్రోద్బలం లేకపోతే ఆమె ఇంతగా దిగజారేది కాదు, పీటర్‌ను పెళ్లే చేసుకోకపోతే ఆమె కోర్టు గడప తొక్కాల్సి వచ్చేది కాదన్న డిఫెన్స్‌ వాదనను పరిగణలోకి తీసుకుంటున్నాను. అయినా కమిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ సెక్స్‌ అఫెన్స్, సెక్సువల్‌ అసాల్ట్‌ ఏ చైల్డ్‌ అండర్‌ 13 కింద కఠినమైన శిక్ష విధించాల్సిందే. అన్ని అంశాలకు పరిగణలోకి తీసుకొని 11 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను.







అలాగే, పీటర్‌ టేలర్‌ ఇక్కడ ప్రధాన నేరస్థుడు. కామవాంఛ తీసుకునేందుకు స్కూల్‌ డ్రెస్‌ వేసుకొని రావాల్సిందిగా భార్య బుర్లింగమ్‌ను కోరారు. అందుకు ఆమె అంగీకరించి అలాగే రావడంతో సమస్య మొదలయింది. స్కూల్‌ గర్ల్స్‌ మీదకు పీటర్‌ టేలర్‌ మనసు మళ్లింది. 11 ఏళ్ల నుంచి ఐదేళ్ల వయస్సున్న ఆడ, మగ పిల్లలపై అత్యాచారం జరిపారు. ఈ విషయంలో భర్తకు సహకరించిన భార్య బుర్లింగమ్‌ కూడా పిల్లలతో కామవాంఛ తీర్చుకున్నారు. భార్యను స్కూల్‌ డ్రెస్‌లో చూడాలనుకున్న టేలర్‌కు, స్కూల్‌ పిల్లలపై ఎప్పటి నుంచి కోరిక ఉండి ఉంటుంది. అన్ని విధాల అతనే ప్రధాన నేరస్థుడిగా నిర్ధారిస్తూ 15 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను. అయినా ఇద్దరు ఇక్కడ సెక్స్‌ అఫెండర్స్‌ రిజిస్టర్‌ (వీరి వల్ల భవిష్యత్తులో ముప్పుందనుకుంటే యావజ్జీవ కారాగారా శిక్ష విధించేందుకు ఈ రిజిస్టర్‌ తోడ్పడుతుంది)లో సంతకం చేయాలి’ అని మాంచెస్టర్‌లోని మిన్‌శుల్‌ స్ట్రీట్‌ క్రౌన్‌ కోర్టు జడ్జీ మార్క్‌ సావిస్‌ శనివారం నాడు మాజీ దంపతులకు శిక్ష విధించారు.