మాంచెస్టర్: ‘మీ ఇద్దరికి లైంగిక కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మీకు, మీ ఇంటి వరకు పరిమితం అయితే అది మీ ప్రైవసికి సంబంధించిన విషయం. అది మీ పరిధి దాటి ముక్కు పచ్చలారని పిల్లలను మీ కామవాంఛలోకి లాగారు. అది ఆ పిల్లలపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు అంతులేని బాధను మిగులుస్తుంది. అందుకని మిమ్మల్ని కఠినంగా శిక్షించాల్సిందే!’
‘మీలో కీలి బుర్లింగమ్ అనే 33 ఏళ్ల యువతి సామాన్యరాలు, సాదాసీతా జీవితం గడుపుతున్నారు. ఆమె మానసికంగా ఎంతో కుమిలిపోతోంది. పెళ్లి పెటాకులవడంతో కూడా ఆమె బాధ పడుతోంది. భర్త పీటర్ టేలర్ (33) ప్రోద్బలం లేకపోతే ఆమె ఇంతగా దిగజారేది కాదు, పీటర్‌ను పెళ్లే చేసుకోకపోతే ఆమె కోర్టు గడప తొక్కాల్సి వచ్చేది కాదన్న డిఫెన్స్ వాదనను పరిగణలోకి తీసుకుంటున్నాను. అయినా కమిషన్ ఆఫ్ చైల్డ్ సెక్స్ అఫెన్స్, సెక్సువల్ అసాల్ట్ ఏ చైల్డ్ అండర్ 13 కింద కఠినమైన శిక్ష విధించాల్సిందే. అన్ని అంశాలకు పరిగణలోకి తీసుకొని 11 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను.
పిల్లలతో వాంఛ.. దంపతులకు 26 ఏళ్ల జైలు