బడ్జెట్‌ 2020 : ఆటో ఇండస్ట్రీ ఏం ఆశిస్తోంది?

సాక్షి, ముంబై: రాబోయే యూనియన్ బడ్జెట్‌లో తమకు ప్రోత్సాహకాల కల్పించాలని ఆటోమొబైల్ పరిశ్రమ భావిస్తోంది. సుదీర్ఘ మందగమనం, 2019 లో రెండు దశాబ్దాలు కనిష్టానికి పడిపోయిన అమ్మకాలు నేపథ్యంలో ఆటో రంగ పునరుద్ధరణకు  కొన్ని ఆర్థిక చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వాన్ని కోరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా వాహనలపై జీఎస్‌టీ భారం తగ్గింపు,  లిథియం-అయాన్ బ్యాటరీల దిగుమతిపై సుంకం రద్దు చేయడం వంటి చర్యలను  పరిశ్రమ  ఆశిస్తోంది.