దారుణం: 17వ తేదీన పెళ్లి.. 18న గ్యాంగ్‌ రేప్‌

లక్నో: దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో నవవధువుపై దారుణం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాతి రోజు ఉదయాన్నే సామూహిక లైంగికదాడికి గురైంది. హాపూర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఠానా దేహాట్ ప్రాంతానికి చెందిన యువతికి ఓ యువకుడితో ఈ నెల 17న వివాహమైంది. అప్పగింతల తర్వాత ఆమెను అత్తారింటికి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత రోజయిన జనవరి 18న యువతి కనిపించకుండా పోవడంతో అందరూ కంగారుపడ్డారు. ఇంటి నిండా చుట్టాలతో కళకళలాడుతున్న సమయంలో ఆ యువతి ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందారు.